సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతోందని శాసన మండలి విప్ బానుప్రసాదరావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు బానుప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగురేసి... పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
'ఆరేళ్లలో అంచనాలకు మించి అభివృద్ధి' - 'ఆరేళ్లలో రాష్ట్రంలో అంచనాలకు మించి అభివృద్ధి'
జయశంకర్ భూపాలపల్లిలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ బాను ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరేళ్లలో రాష్ట్రంలో అంచనాలకు మించి అభివృద్ధి జరిగిందని వివరించారు.

'ఆరేళ్లలో రాష్ట్రంలో అంచనాలకు మించి అభివృద్ధి'
రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా గడిచిన ఆరేళ్లలో అంచనాలకు మించి అభివృద్ధి సాధించిందన్నారు. ఒకప్పుడు తాగునీటికి ఇబ్బంది పడే రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా అతి స్వల్పకాలంలో నిర్మించి రెండు పంటలకు సాగునీరు అందించామన్నారు.