శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం ప్రస్తుతం 850 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రానికి నిల్వ 80.90 టీఎంసీలుగా నమోదైంది. జూరాలకు ఎగువ నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కులు, విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ల నుంచి 35 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల జలాశయం నుంచి 11 వేలు, హంద్రీ నది నుంచి ఐదు వేలు, ఇతరత్రా కలిపి మొత్తంగా 75 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోంది. తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ల నుంచి 38,140 క్యూసెక్కులు నాగార్జుసాగర్‌లోకి వదులుతున్నారు.