తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నివారణకు కాళేశ్వరంలో ప్రత్యేక యాగాలు - జయశంకర్ భూపాలపల్లి జిల్లా

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కరోనా నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు మృత్యుంజయ యాగం, సుదర్శన హోమం, తదితర ప్రత్యేక అభిషేకాలు చేశారు.

Special Poojas performed at Kaleshwaram Temple in Bhopalpalli District
కరోనా నివారణకు కాళేశ్వరంలో ప్రత్యేక యాగాలు

By

Published : Mar 24, 2020, 12:33 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రసిద్ధ క్షేత్రం కాళేశ్వరం ఆలయంలో విశేష పూజలు చేశారు. కరోనా వ్యాధి నివారణ కోసం దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అర్చకులు పూజలు చేస్తున్నారు.

లోక కల్యాణార్థం మహా మృత్యుంజయ యాగం, సుదర్శన, ధన్వంతరి హోమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాళేశ్వరం-ముక్తీశ్వర స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు చేశారు.

కరోనా నివారణకు కాళేశ్వరంలో ప్రత్యేక యాగాలు

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా లాక్​డౌన్​... కరోనా కేసులు@471

ABOUT THE AUTHOR

...view details