జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామనపల్లికి చెందిన సెగ్గం మధుకర్ అనే వ్యక్తి తన తల్లి రాజమ్మను కిరాతకంగా హత్య చేశాడు. రెండు వివాహాలు చేసుకున్న మధుకర్‌కు కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు. మద్యానికి బానిసైన అతను డబ్బుల కోసం తల్లి రాజమ్మతో గొడవ పడ్డాడు. ఆ క్షణంలో రోకలి బండతో ఆమె తలపై దాడి చేశాడు.
తల్లిని చంపిన తనయుడు - జయశంకర్ భూపాలపల్లి మహాముత్తారం తల్లి హత్య
నవ మాసాలు మోసి కనీ పెంచిన తల్లినే ఓ తనయునడు దారుణంగా చంపేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామనపల్లిలో ఈ ఘటన జరిగింది.
తల్లిని చంపిన తనయుడు
రక్తపు మడుగులో ఉన్న రాజమ్మను బంధువులు, స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతిచెందింది. ఘటన స్థలాన్ని కాటారం డీఎస్పీ కిషన్, సీఐ హాథీరామ్లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ఆసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని... అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ