Son Killed Father over Property Disputes : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో ఓ బాలుడు కన్న తండ్రినే హతమార్చాడు. అనంతరం ఆ శవాన్ని మాయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించి.. చివరకు కటకటాల పాలయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లికి చెందిన గుమ్మడి తిరుపతి (48), రాజమణి దంపతులకు 17 ఏళ్ల కుమారుడు ధనుంజయ్ ఉన్నాడు. అనారోగ్యం కారణంగా తల్లి రాజమణి ఏడాదిన్నర క్రితం మృతి చెందగా.. ధనుంజయ్ తండ్రితో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు.
బీమా కథా చిత్రమ్.. డబ్బు కోసం తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు
Son kills Father in Bhupalapally District : అయితే గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంతో సరిగా పని చేయలేని స్థితిలో ఉన్న తిరుపతి.. తనకు ఉన్న ఏడెకరాల పొలాన్ని కౌలుకు ఇచ్చాడు. 7వ తరగతిలోనే చదువు మానేసి జులాయిగా తిరుగుతున్న కుమారుడి ప్రవర్తన కారణంగా.. పంట భూమి పాసు పుస్తకాలను తన చెల్లెలి వద్ద దాచాడు. దీంతో కక్ష పెంచుకున్న బాలుడు తరచూ తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆవులను విక్రయించగా వచ్చిన సొమ్మును ఇవ్వాలని ధనుంజయ్ అడగగా.. తండ్రి అందుకు నిరాకరించాడు. దీంతో మరింత కోపం పెంచుకున్న కుమారుడు.. నాన్నను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూశాడు. ఆ సమయం రానే వచ్చింది. ఈ నెల 16న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి తిరుపతి తలపై రాడ్డుతో కొట్టి.. మెడకు తాడు బిగించి చంపేశాడు. అనంతరం శవాన్ని ఓ దుప్పటిలో చుట్టి ఇంట్లోనే ఓ మూలన పడేశాడు.