కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ భూపాలపల్లిలోని సింగరేణి గనులలో 72 గంటల సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కూడా ఈ ఒక్క రోజు మద్దతు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 41 బొగ్గుబ్లాక్లను గత నెల 18న వేలం ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను ధారాదత్తం చేయడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందన్నారు.
మోదీ ప్రభుత్వం నిరంకుశ విధానాలను సింగరేణి కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తక్షణమే మోదీ ప్రభుత్వం బొగ్గుగనుల వేలం పాటలను నిలిపివేసి ప్రభుత్వ రంగంలోనే సింగరేణి ఉంచాలన్నారు. కోల్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో బొగ్గు క్షేత్రాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.