Singareni Election Polling in Telangana :సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ నిర్వహించే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ల ద్వారా ఎన్నికల, లెక్కింపు సిబ్బందిని నియమించారు. సింగరేణి ఎన్నికల అధికారిగా శ్రీనివాసులు పర్యవేక్షణలో ఎన్నికలు జరగుతున్నాయి. ప్రతి ఏరియాకు ఒక ఏఆర్(Assistant Election Officer) ఉంటారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. అందుకుగానూ 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపడనుండటంతో, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Singareni Elections Schedule Telangana 2023 :సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఏర్పాట్లను యాజమాన్యం చకచకా పూర్తి చేసింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియగా, ఇవాళ బ్యాలెట్ పద్ధతిలో సింగరేణి ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెను వెంటనే రాత్రి 7 గంటల నుంచిసింగరేణి ఫంక్షన్ హాల్లోఓట్ల లెక్కింపు(Counting of votes) ప్రారంభం అవుతుంది. లెక్కింపు తరువాత ఫలితాలు వెలువడనున్నట్లు అధికారులు వెల్లడించారు.
All Set for Singareni Trade Union Election :ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో విస్తరించిన సింగరేణి సంస్థలో జరుగుతున్న ఎన్నికలకు గానూ, మొత్తం 39,832 మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఇప్పటికే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి, శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. కాగా, పోలింగ్ బూత్‌లను సోమవారం సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఆయా డివిజన్ల అధికారులు పరిశీలించారు. పోలింగ్ రోజు ప్రతి ఉద్యోగి తమ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.
Singareni Polls 2023 :సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించాలని కార్మిక సంఘం నాయకులు, కార్మికులతో ప్రచారాలు కొనసాగించారు. ఏ కార్మిక సంఘం గెలిస్తే కార్మికులకు ఏమేం చేస్తామో తెలుపుకుంటూప్రచారాలను కొనసాగించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్మికులతో ప్రచారం నిర్వహించారు. ఏఐటీయూసీ కార్మిక సంఘానికి కార్మిక సంఘ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కార్మికులతో సమావేశం నిర్వహించారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికి ప్రొఫెసర్ కోదండరాం ప్రచారం నిర్వహించారు. బీఎంఎస్, ఏఐటీయూసీ కార్మిక సంఘాలకు ఆయా కార్మిక సంఘం నాయకులు ప్రచారాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో గెలుపొందితే ఏమేమి చేస్తామో కార్మికులకు తెలియజేస్తూ కార్మికుల, ఉద్యోగుల ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటలకు జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో సింగరేణి కార్మికులు ఏ గుర్తింపు సంఘాన్ని ఎన్నుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.
Details of Voters in Bhupalappalli Singareni Area :భూపాలపల్లి సింగరేణి ఏరియాలో 5,350 మంది ఓటర్లకు గానూ 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సింగరేణి జీఎం కార్యాలయంలో 197 మంది ఓటర్లు, ఎస్అండ్ పీసీ విభాగంలో 77 మంది ఓటర్లు, ఏరియా సింగరేణి ఆస్పత్రిలో 124 మంది ఓటర్లు, ఏరియా స్టోర్స్ విభాగంలో(Store Department) 38 మంది ఓటర్లు, ఏరియా వర్క్ షాపులో 137 మంది ఓటర్లు, ఓపెన్ కాస్ట్ లో 361 మంది ఓటర్లు, అండర్ గ్రౌండ్ మైన్ లో 4,414 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పనిచేసే చోటనే కార్మికులకు, అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం డ్యూటీ దిగాక, ఫస్ట్ షిప్ట్ డ్యూటీకి వెళ్లనున్న కార్మికులు, ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అక్కడే కేంద్రాలను ఏర్పాటు చేశారు. 100శాతం పోలింగ్ జరిగే విధంగా ప్రతి ఒక్క సింగరేణి ఉద్యోగి, కార్మికుడు తమ ఓటు హక్కును వినియోగించుకావాలని తెలిపారు.