తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డుపై కూలిన చెట్లను తొలగించిన ఎస్సై - వర్షానికి కూలిన చెట్టు

నిన్న కురిసిన వర్షానికి రోడ్డుపై చెట్లు కూలిపోయాయి. అయితే ఓ ఎస్సై మాత్రం రహదారికి అడ్డంగా ఉన్న దానిని తన సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ ఘటన జయశంకర్​ భూపాలపల్లిలో చోటుచేసుకుంది.

SI remove trees on road at jayashankar bhupalapally district
రోడ్డుపై కూలిన చెట్లను తొలగించిన ఎస్సై

By

Published : May 17, 2020, 7:07 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం రావడం వల్ల పీఎస్​ ఎదురుగా ఉన్న జగ్గయ్యపేట రోడ్​లో ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోయాయి. దాని వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత ఆర్​ అండ్​ బి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రేగొండ ఎస్సై కృష్ణప్రకాశ్​ గౌడ్​ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని... రోడ్డుపై నుంచి చెట్లను పక్కకు తొలగించారు. దీనితో వాహనదారులు, బాటసారులు ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేశారు. రేగొండ ఎస్సై కృష్ణ ప్రకాశ్​ గౌడ్​ను వాహనచోదకులు, మండల ప్రజలు అభిందించారు.

ఇదీ చూడండి:-వలస కూలీల ఆగ్రహం- ఉత్తర భారతంలో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details