జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో శ్రాద్ధ కర్మలను నిలిపివేశారు. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరిగిపోతున్నందున కాళేశ్వర బ్రాహ్మణ సంఘం స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద శ్రాద్ధ కర్మలు నిలిపివేత - కాళేశ్వరం త్రివేణి సంగమం
కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నందున ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో శ్రాద్ధ కర్మలను నిలిపివేశారు. గోదావరి తీరంలో శుక్రవారం నుంచి మే ఒకటోతేదీ వరకు కర్మకాండలను స్వచ్ఛందంగా నిలిపేస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు.
bhupalapally
శుక్రవారం నుంచి మే ఒకటోతేదీ వరకు కాళేశ్వర ముక్తేశ్వర త్రివేణి సంగమం... గోదావరి తీరంలో ఆస్థి సంచయనం, పిండప్రదానాలు, కర్మకాండలు నిలిపేస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి:పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి: కేసీఆర్