జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయానికి భక్తులు పోటేత్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను నీటిలో వదిలారు. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేపూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
కాళేశ్వరంలో ఘనంగా మహాశివరాత్రి పూజలు - మహాశివరాత్రి జాతర
మహాశివరాత్రిని పురస్కరించుకుని కాళేశ్వరానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి... ముక్తీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SHIVARATRI CELEBRATIONS IN KALESHWARAM MUKTHEESHWARA TEMPLE
గోదావరి నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే విధంగా సింగరేణి రెస్క్యూ టీంను ఏర్పాటు చేశారు.