తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని... ఎస్​ఎఫ్​ఐ ఆందోళన - sfi Students

భూపాలపల్లిలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ను ముట్టడించారు. బీఈడీ, పాలిటెక్నిక్ కళాశాలు లేక విద్యార్థులు దూరప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టరేట్​ను ముట్టడించిన ఎస్​ఎఫ్​ఐ

By

Published : Aug 29, 2019, 10:55 PM IST

కలెక్టరేట్​ను ముట్టడించిన ఎస్​ఎఫ్​ఐ

విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు. 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు ప్రత్యేక భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు అందడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details