జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పోలీసులకు వింత పరిస్థితి ఎదురైంది. సంక్రాంతి సందర్భంగా పట్టుకున్న పందెం కోళ్లను వేలం వేయాలని న్యాయస్థానం ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 14న సంక్రాంతి రోజు కోడి పందాలు అడుతున్నారన్న సమాచారంతో... తాడిచెర్ల శివారులోని దేశబందం ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. మూడు కోడి పుంజులు, 22 మోటార్ సైకిళ్లతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులు పారిపోయిన మిగతా వ్యక్తుల కోసం గాలిస్తూ... పట్టుకున్న కోళ్లకు సంబంధించిన సమాచారం పెద్దపల్లి జిల్లా మంథని కోర్టుకు అందజేశారు.
ఆదివారం పందెం కోళ్ల వేలం.. కిలో రూ.300! - వేలంలో సంక్రాంతి పందెం కోళ్లు
పోలీసుల దాడిలో పట్టుబడ్డ పందెం కోళ్లను వేలం వేయాలని పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు ఆదేశించింది. ఈ నెల 14న సంక్రాంతి నాడు... తాడిచెర్ల శివారులోని దేశబందం ప్రాంతంలో కొయ్యూరు పోలీసులు దాడులు చేసి మూడు కోళ్లు, 22 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వేలంలో సంక్రాంతి పందెం కోళ్లు.. కిలో రూ.300..!
దాదాపు 15రోజలుగా కోళ్లను సంరక్షించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు కోళ్లను వేలం వేయాలని కోర్టు సూచించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 31న ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. న్యాయస్థానం ఆదేశం మేరకు... కిలోకు రూ.300ల చొప్పున ధర నిర్ణయించారు. అంతకు మించి వేలం పాడిన వారికి మాత్రమే ఆ కోళ్లు దక్కనున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:మియాపూర్లో వరుస చోరీలు.. ఇద్దరు అరెస్ట్