భూపాలపల్లిలోని బాంబుల గడ్డ ప్రధాన రహదారిపై నిర్వహించిన వాహన తనిఖీల్లో అధిక లోడ్‌తో వెళ్తున్న 6 ఇసుక లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ రవాణా చేస్తున్న వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు రద్దుచేయనున్నట్లు ఆర్టీవో రవీందర్ తెలిపారు. అక్రమాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. కాళేశ్వరంలోని ఇసుక రీచ్‌ల నుంచి తరలిస్తున్న వాహనాలకు ఆన్లైన్లో పర్మిషన్లు ఉండాలని సూచించారు. అందుకు విరుద్ధంగా లారీలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవీందర్ హెచ్చరించారు.
6 ఇసుక లారీలను సీజ్ చేసిన అధికారులు - sand-lorry-seized-by-dto
భూపాలపల్లిలోని బాంబుల గడ్డ ప్రధాన రహదారిపై ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అధిక బరువుతో వెళ్తున్న 6 ఇసుక లారీలను సీజ్ చేశారు.
![6 ఇసుక లారీలను సీజ్ చేసిన అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3758551-thumbnail-3x2-ppp.jpg)
sand-lorry-seized-by-dto
TAGGED:
sand-lorry-seized-by-dto