తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీలో గౌరవం లేదు.. తెరాసకు సర్పంచ్ రాంరాం - సర్పంచ్ బండారి కవితా దేవేందర్ వార్తలు

తెరాస నాయకుల వైఖరి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తూ రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవితా దేవేందర్ తెరాస పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కారణాలు వివరిస్తూ మర్యాద పూర్వకంగా లేఖ రాశారు.

Rupireddy palli, sarpanch resigne
సర్పంచ్ రాజీనామా, రూపిరెడ్డిపల్లి సర్పంచ్ బండారి కవితా దేవేందర్

By

Published : Apr 4, 2021, 5:28 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవితా దేవేందర్ తెరాస పార్టీకి రాజీనామా చేశారు. తెరాస నాయకుల వైఖరిని భరించలేక రాజీనామా చేశామని ఆమె వెల్లడించారు. సర్పంచ్​కు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడంలేదని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి మర్యాద పూర్వకంగా లేఖ రాశారు. ప్రజా ప్రతినిధులను ఇప్పటికైనా పట్టించుకోవాలని.. లేకుంటే ఇంకా మనోవేదనకు గురవుతారని తెలిపారు.

'నేను సర్పంచిగా గెలిచిన తరువాత నుంచి మండలంలోని కొందరు ముఖ్య నాయకులు కావాలని పాలనాపరంగా ఇబ్బందులకు గురి చేస్తూ మనోవేదనకు గురిచేశారు. ఇటీవల మా గ్రామంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమాలకు పిలవలేదు. పార్టీ కార్యక్రమాల్లో మమ్మల్ని కావాలనే పక్కన పెడుతున్నారు. నాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఇబ్బంది పెడుతున్నారు' అంటూ లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సాంప్రదాయ పంటలకు స్వస్తి.. దీర్ఘకాలిక సాగుతో లాభార్జన

ABOUT THE AUTHOR

...view details