తెలంగాణ

telangana

ETV Bharat / state

రాకింగ్​ క్లైంబింగ్​

అడ్వెంచర్స్​ ఇష్టపడే వారికి క్లైంబింగ్​ ఓ గొప్ప అనుభూతి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా తిరుమల గిరిలోని పాండవుల గుట్టలో రాక్​ క్లైంబింగ్​ నిర్వహించారు. ఇందులో పాల్గొనడం ఎంతో ఆనందగా ఉందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు.

క్లైంబింగ్​ చేస్తున్న పర్యాటకుడు

By

Published : Feb 8, 2019, 6:30 AM IST

భూపాలపల్లి తిరుమల గిరిలో రాక్​ క్లైంబింగ్​
అడ్వెంచర్స్​ ఇష్టపడే వారికి క్లైంబింగ్​ ఓ గొప్ప అనుభూతి. ఎత్తైన గుట్టలను తాడుతో ఎక్కడం మంచి థ్రిల్​కు గురి చేస్తుంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా తిరుమల గిరిలోని పాండవుల గుట్టలో ఏకో టూరిజం, అటవీశాఖ రాక్​ క్లైంబింగ్​ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పర్యాటకులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

ఇలాంటి పాండవుల గుట్టలు మన ప్రాంతంలో ఎక్కడ లేవని.. ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు అటవీ అధికారులు ఏర్పాటు చేశారని సందర్శకులు అన్నారు. వారితో పాటు తమ స్నేహితులను కూడా తీసుకొచ్చి ఆనందిస్తామని వారు తెలిపారు.

పాండవుల గుట్టలో మంచి అనుభూతి కలుగుతుందని వరంగల్​ నిట్​ కాలేజ్​, నర్సంపేట ప్రగతి కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details