తెలంగాణ

telangana

ETV Bharat / state

'వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ' - 'వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ'

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్​ అబ్దుల్​ అజీమ్​ ప్రారంభించారు. జిల్లా పరిధిలో 4007 మంది వలసదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

rice-distribution to migration labours
'వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ'

By

Published : Mar 31, 2020, 3:53 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులుగా ఉండి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క వలసదారుడికి అండగా ఉంటామని జిల్లా పాలనాధికారి అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. మహదేవపూర్ మండలంలో లాక్​డౌన్ పరిస్థితులను మంగళవారం పరిశీలించారు. జిల్లా పరిధిలో 4007 మంది వలసదారులు ఉన్నారని, వారికి నిత్యవసర సరుకులు, తాగునీరు, వైద్యం తదితర సదుపాయం కల్పనలో ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

'వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ'

వ్యవసాయ పనుల నిమిత్తం మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కూడా రాష్ట్రవాసులుగానే చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం వలసకూలీకి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో బియ్యం పంపిణీ, నగదు అందజేత కార్యక్రమంను కలెక్టర్​ ప్రారంభించారు.

మహదేవపూర్ కూరగాయల మార్కెట్​లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రజలను అడిగి ధరల వివరాలను తెలుసుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నార వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

ఇవీ చూడండి:మందు బాబులకు లిక్కర్ పాసులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details