తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy Meets Singareni Workers : 'సింగరేణి ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'

Revanth Reddy Meets Singareni Workers in Bhupalpally : కాంగ్రెస్ జోష్‌గా ప్రారంభించిన బస్సు యాత్ర ప్రస్తుతం భూపాలపల్లిలో కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి సింగరేణి కార్మికులతో పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. తాము అధికారంలోకి రాగానే సింగరేణి సమస్యలు పరిష్కరించి.. ఎన్నికలు జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Congress Second Day Bus Yatra
Revanth Reddy Meet With Singareni Workers

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 10:26 AM IST

Updated : Oct 19, 2023, 12:25 PM IST

Revanth Reddy Meets Singareni Workers సింగరేణి ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

Revanth Reddy Meets Singareni Workers in Bhupalpally :తెలంగాణ రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు అక్టోబరు 18నబస్సు యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్ర నేతలతో ములుగులో ప్రారంభమైన బస్సు యాత్ర ప్రస్తుతం భూపాలపల్లిలో కొనసాగుతోంది. గురువారం ఇవాళ భుపాలపల్లి నుంచి .. పెద్దపల్లికి చేరుకోనుంది. మొదటి విడతగా మొదలైన ఈ బస్సు యాత్ర నిజామాబాద్‌లో ముగియనుంది. కాంగ్రెస్ నాయకులు ఈ యాత్రను పార్టీ అగ్రనేతలతో ప్లాన్‌ చేశారు. కాంగ్రెస్ డిక్లేర్ చేసిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Congress Bus Yatra in Bhupalpally 2023 : భూపాలపల్లిలో కొనసాగుతున్న బస్సు యాత్రలో భాగంగా పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)సింగరేణి కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీవ్రస్థాయిలో అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఒక్క అధికారిని సీఎండీగా ఇంతకాలం ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరేణి మంచి లాభాల్లో ఉండాలి అంటే మంచి యాజమాన్యం చేతిలో ఉండాలని చెప్పారు.

Telangana Congress Bus Yatra 2023 : తిరగబడదాం- తరిమికొడదాం అనే నినాదంతో.. కాంగ్రెస్ బస్సు యాత్ర

Revanth Reddy Fires on CM KCR :ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తాని రేవంత్ హామీ ఇచ్చారు. గండ్ర సత్యనారాయణ ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రజలోతోనే ఉన్నారంటూ తెలిపారు. డిసెంబరు 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే రాష్ట్రంలో డిసెంబరు 3న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించండి అంటూ ప్రజలను కోరారు.

Congress Bus Yatra in Telangana 2023 : ఇలా ఎన్నికల షెడ్యూల్ రాగానే.. అలా బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

Congress Bus Yatra Second Day in Bhupalpally : రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములు అన్న రేవంత్ రెడ్డి.. వారు చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని మండిపడ్డారు. కార్మికుల వైపు ఉన్నామన్న ప్రభుత్వం.. ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోకుండా.. గాలికి వదిలేసిందని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుందని పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అరబిందోకు మైన్ అప్పగించింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. తాడిచర్ల గనులను కేసీఆర్ అనుచరులకు ఇచ్చింది నిజం కాదా అంటూ నిలదీశారు. నైనికోల్ మైన్‌ను అదానీకి కట్టబెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం చూసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే సింగరేణి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి ఎన్నికలు ఎందుకు జరపడం లేదని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Congress Candidate List 2023 : రేపే కాంగ్రెస్​ పార్టీ 70 మంది అభ్యర్థుల తొలి జాబితా?.. 18 నుంచి బస్సు యాత్ర

Congress PAC Meeting in Telangana : గాంధీభవన్​లో పీఏసీ సమావేశం.. ప్రచార ప్రణాళికపై ప్రత్యేక దృష్టి

Last Updated : Oct 19, 2023, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details