భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడం వల్ల, అప్పు ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పురుగుల మందు తాగి అన్నదాత ఆత్మహత్య - red chelli farmer suicide at bhupalapally district
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రావపోవడం వల్ల అప్పు ఎలా తీర్చాలో తెలియక పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పురుగుల మందు తాగి మిర్చి రైతు ఆత్మహత్య
మహదేవపూర్‌కు చెందిన ఓలిశెటి బాపు మూడున్నర ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. వాతావరణ ప్రతికూలతతో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. అప్పు ఎలా తీర్చాలో తెలియక పరిస్థితుల్లో శుక్రవారం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రైతన్న మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇవీచూడండి: వివాహేతర బంధం.. ఇద్దరు సజీవదహనం