తెలంగాణ

telangana

ETV Bharat / state

జయశంకర్​ జిల్లాలో వర్షాలు.. పొంగుతున్న వాగులు - వైద్యం కోసం ఇబ్బందులు

జయశంకర్​ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు గ్రామస్థులు మాత్రం నిత్యావసర సరుకులు, వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. వంతెనలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు పూర్తి చేయట్లేదని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

పొంగుతున్న వాగులు

By

Published : Jul 29, 2019, 11:52 AM IST

జయశంకర్​ జిల్లాలో వర్షాలు.. పొంగుతున్న వాగులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, పలిమేల, మహముతరం, మల్హర్, కాటారం మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గత మూడు రోజులుగా ముసురు కమ్ముకుంది. మహాదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఏకధాటిగా కురుస్తోన్న వర్షంతో జనజీవనం స్తంభించింది. ఒక వైపు ఎండుతున్న పంటలకు వర్షం కురవడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు, వైద్యం కోసం పాట్లు పడుతున్నారు. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం వల్ల గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. వంతెన నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు పట్టించుకోక పూర్తి కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details