తెలంగాణ

telangana

ETV Bharat / state

Rahul Gandhi Speech At Bhupalapally Bus Yatra : 'తెలంగాణతో గాంధీ కుటుంబానిది రాజకీయ బంధం కాదు.. ప్రేమానుబంధం' - రాహుల్ గాంధీ

Rahul Gandhi Speech At Bus Yatra Bhupalapally : రాష్ట్రంలో.. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు జరగనున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ​గాంధీ అన్నారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వం నెలకొందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బస్సు యాత్రతో పాల్గొని పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్నారు.

Rahul Gandhi bus trip
Rahul Gandhi Bike Rally in Bhupalapally

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 12:22 PM IST

Updated : Oct 19, 2023, 1:02 PM IST

Rahul Gandhi Speech At Bhupalapally Bus Yatra తెలంగాణతో గాంధీ కుటుంబానిది రాజకీయ బంధం కాదు.. ప్రేమానుబంధం

Rahul Gandhi Speech At Bus Yatra Bhupalapally :తెలంగాణ ప్రజలకు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామని.. కానీ తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని రాహుల్ గాంధీ(Rahul Gandhi in Telangana) విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో.. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని..దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు.

Rahul Gandhi Fires on BJP :కేంద్రంలో బీజేపీపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంటే.. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీ పెట్టి బీజేపీకి సహకరిస్తోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని.. రైతు చట్టాలకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. నేడు దేశంలో ప్రజల సంక్షేమం కోసం.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కులగణనపై తాను మాట్లాడినట్లు తెలిపారు.

Rahul Gandhi Speech at Mulugu Congress Public Meeting : 'దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి'

దేశంలో కేవలం ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్‌ను నియంత్రిస్తున్నారని.. ప్రజలందరినీ పరిపాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని పునరుద్ఘాటించారు. మోదీ, అదానీ మంచి స్నేహితులని.. అదానీ దేశంలో రూ.లక్షల కోట్లు అప్పు తీసుకున్నారని.. అదానీ తీసుకున్న అప్పులను బీజేపీ మాఫీ చేస్తోందని ఆరోపించారు. కానీ స్వయం ఉపాధి కింద మహిళలు తీసుకున్న రుణాలను మాత్రం ఎందుకు మాఫీ చేయదని ప్రశ్నించారు..

"తెలంగాణ ఇస్తామని 2004లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు హామీని కాంగ్రెస్‌ నిలబెట్టుకుంది. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సోనియాగాంధీ సాకారం చేశారు. తెలంగాణ ప్రజల ధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఇప్పుడు చూస్తున్నాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతాం. తెలంగాణ ప్రజలతో ఇందిరా, సోనియా, రాజీవ్‌, నాకున్నది రాజకీయ సంబంధం కాదు. మా కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్నది ప్రేమానుబంధాల బంధం". - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Rahul Gandhi Fires on BRS Govt : దేశంలో ప్రజలు కొనే ప్రతి వస్తువుపై బీజేపీ జీఎస్టీ వసూలు చేస్తోందని.. ప్రజల నుంచి పన్నుల వసూలు చేసి అదానీకి కట్టబెడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్(CM KCR), ఆయన పరివారం.. రాష్ట్రంలో సంపదను ఎలా దోచుకుందో ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.

Revanth Reddy Meets Singareni Workers : 'సింగరేణి ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'

కర్ణాటక ఎన్నికలలో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను.. అక్కడి రాష్ట్రంలో అమలు చేస్తున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కర్ణాటక రైతులకు రుణమాఫీ చేశామని.. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినట్లు తెలిపారు. రాజస్థాన్‌లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కింద రూ.25 లక్షల ప్రయోజనం చేకూర్చామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ దళితులకు.. మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్‌ హామీ అమలైందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను.. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సోనియాగాంధీ సాకారం చేశారని.. తెలంగాణ ప్రజల ధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఇప్పుడు చూస్తున్నామని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతామని రాహుల్ మాటిచ్చారు.

Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్‌ మోదీ చేతిలో ఉంది'

Last Updated : Oct 19, 2023, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details