కరోనా వ్యాక్సినేషన్ కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. మొదటి డోసులో మండలానికి చెందిన 15 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 90 శాతం మంది టీకాలు తీసుకున్నారు. మూడు రోజుల క్రితం రెండో విడత టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి జనం ఉత్సాహం చూపుతున్నారు. పట్టణ ప్రజల కంటే పల్లె ప్రజలు ఎంతో చైతన్యవంతులు అని నిరూపిస్తున్నారు మల్హర్ మండల ప్రజలు. టీకాలు వేసుకోవడానికి వైద్యశాలకు ఉదయం నుంచే బారులుతీరారు.
Vaccination: రెండో డోసు కోసం పీహెచ్సీ వద్ద జనం పడిగాపులు - public que at thadicharla phc in jayashankar bhupalapally district
కరోనా రెండో దశ తీవ్రమవుతున్న నేపథ్యంలో పల్లె ప్రజలు టీకాలపై ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి పీహెచ్సీల వద్ద బారులు తీరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలానికి చెందిన ప్రజలు.. టీకా కేంద్రాల వద్ద క్యూ కట్టారు.
![Vaccination: రెండో డోసు కోసం పీహెచ్సీ వద్ద జనం పడిగాపులు public que at thadicharla phc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:00:10:1622097010-tg-krn-105-27-teekaakosambaarulu-av-ts10125-27052021101251-2705f-1622090571-951.jpg)
ఫీవర్ సర్వేలో ఇంటింటికీ తిరిగిన వైద్య సిబ్బంది.. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని వైద్యశాల వైద్యాధికారి గోపీనాథ్ సూచించారు. దీంతో 45 సంవత్సరాలు దాటిన వారందరూ ఆరోగ్య కేంద్రానికి తరలివచ్చారు. కొంతమంది కొవిషీల్డ్ రెండో విడత టీకా వేస్తున్నారని తెలిసి వైద్య కేంద్రానికి ఉదయమే చేరుకున్నారు. ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం కొవ్యాగ్జిన్ టీకాలు మాత్రమే వేయాలని సూచించిందని.. రెండో విడతలో భాగంగా ఏ రోజున ఏ టీకాలు వేసుకోవాలో వృద్ధులకు, పెద్దలకు సిబ్బంది తెలియజేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఏ టీకాలు వేస్తున్నారో తెలియకపోకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.