తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయం చేయాలంటూ మృతదేహాంతో ధర్నా

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంతో ఒకరు చనిపోయారు. తమకు న్యాయం జరగాలని దాడి చేసిన వ్యక్తి ఇంటి ముందు మృతుని బంధువులు ధర్నా చేశారు. నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

న్యాయం చేయాలంటూ మృతదేహాంతో ధర్నా
న్యాయం చేయాలంటూ మృతదేహాంతో ధర్నా

By

Published : Jul 9, 2020, 12:12 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారంలో ఈ నెల 6న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన రేవెళ్ళి రాజబాపు (35) వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బుధవారం దాడి చేసిన దేవదారి శ్రీనివాస్ ఇంటి ముందు రాజబాపు మృతదేహంతో బంధువులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని బైఠాయించారు.

సమాచారం అందుకున్న కాటారం సీఐ బానోత్ హతీరాం, కొయ్యూరు ఎస్సై సత్యనారాయణ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేసి నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, నష్టపరిహారం చెల్లించాలని పలువురు డిమాండ్‌ చేశారు. రాజబాపు మృతికి కారకులు ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని సీఐ బానోత్‌ భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ABOUT THE AUTHOR

...view details