తెలంగాణ

telangana

ETV Bharat / state

పురుగుమందు డబ్బాలతో అన్నదాతల ఆందోళన - annaram barrage updates

అన్నారం బ్యారేజ్​ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం, చండ్రుపల్లి గ్రామాలకు చెందిన రైతులు పురుగు మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజ్​ గేట్లు తెరిచినపుడు తమ పంటలు దెబ్బతింటున్నాయాని ఆందోళన బాట పట్టారు.

protest against annaram barrage by annaram and chandrupalli formers at annaram barrage area
పురుగుమందు డబ్బాలతో అన్నదాతల ఆందోళన

By

Published : Sep 29, 2020, 11:05 PM IST

అన్నారం బ్యారేజ్​ గేట్లు తెరిచినపుడు కష్టపడి పండిస్తున్న పంటలు నీటమునిగి.. ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ బాధను మొరపెట్టుకున్నా స్పందించడం లేదని వాపోయారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం, చండ్రుపల్లి గ్రామాలకు చెందిన రైతులు పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అన్నారం బ్యారేజ్​ ప్రాంతంలో నియంత్రణ గది వద్ద నిరసన చేపట్టారు.

ఇంజనీర్ల సమాచారంతో మహదేవపూర్ సీఐ ఏ.నర్సయ్య, కాళేశ్వరం ఎస్సై నరహరి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆందోళన చేపట్టరాదని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకవెళ్లాలని సూచించడంతో రైతులు తమ ఆందోళన విరమించుకున్నారు. ఈ విషయమై క్షేత్రస్థాయి ఇంజనీర్లు కాళేశ్వరం ఠాణాలో రైతులపై ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:ఆర్టీసీలో ప్రయాణం అంతంత మాత్రమే.. తగ్గిన ఆక్యుపెన్సీ

ABOUT THE AUTHOR

...view details