భారతదేశం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమని, గ్రామాలే దేశ అభివృద్ధికి కీలకమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూపాలపల్లి జిల్లా అధికారులతో సంభాషించారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులతో మోదీ దృశ్యమాధ్యమ సమీక్ష - భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు
పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడారు. గ్రామాభివృద్ధికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ప్రధాని వివరించారు. గ్రామాల్లో కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లా అధికారులతో ప్రధాని మోదీ... ఏమి చెప్పారంటే..?
గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, డీఆర్డీవో సుమతి, జడ్పీ సీఈవో శిరీష, డివిజనల్ పంచాయతీ అధికారి సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా