తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి రంగం సిద్ధం - Hyderabad District latest News

బహుళ పోషక విలువలు గల ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ కోసం రంగం సిద్ధమైంది. పైలట్‌ ప్రాజెక్టు కింద భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Prepare the sector for Fortified Rice distribution
ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి రంగం సిద్ధం

By

Published : Jun 5, 2021, 10:43 PM IST

బహుళ పోషక విలువలు గల ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ కోసం రంగం సిద్ధమైంది. పౌరసరఫరాల శాఖ ద్వారా భూపాలపల్లి జయశంకర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. పౌష్టికాహారం, రక్తహీనత, విటమిన్లు, మినరళ్ల లోపంతో బాధపడే ప్రజలకు ఈ బియ్యం అత్యంత ఉపయుక్తంగా ఉంటాయన్న లక్ష్యంతో... వినియోగం పెంపు కోసం ఈ కార్యక్రమం అమలు సంబంధించి ప్రభుత్వం ఓ క్రియాశీలక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ వ్యవహరిస్తారు.

సభ్యులుగా ఆర్థిక, పాఠశాల విద్యా, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఎఫ్‌సీఐ ప్రాంతీయ జనరల్ మేనేజర్, పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, మహిళాభివృద్ధి, కమిషనర్, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లేమితో బాధపడే కుటుంబాలకు ఈ ఫోర్టిఫైడ్​ బియ్యం పంపిణీ చేసి... ఆ లోపం అధిమించాలన్నది లక్ష్యం. కొవిడ్ నేపథ్యంలో ఈ బలవర్థక బియ్యం ఆహారంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు ఛౌక ధరల దుకాణాల ద్వారా ఈ బియ్యం పంపిణీ సాగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:Harish rao: 'ప్రాణమున్నంత వరకు కేసీఆర్​ మాట జవదాటను'

ABOUT THE AUTHOR

...view details