జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
ప్రణబ్ ముఖర్జీ మరణం యావత్ దేశానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్నప్పుడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఎలక్షన్ ఏజెంట్‌గా నియమించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన కోసం పని చేసే అవకాశం కల్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.