తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణిలో ప్రతి దరఖాస్తుకూ సమాధానమివ్వాలి: కలెక్టర్ - collector krishna adithya

ప్రజావాణికి వచ్చే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు మండలాల్లో పర్యటించి అక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

prajavani-program-in-jayashankar-bhupalpally-district-collectorate
భూపాలపల్లిలో ప్రజావాణి కార్యక్రమం

By

Published : Feb 2, 2021, 11:21 AM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

సారూ.. జర సాయం చేయండి

మండలస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలతో కలెక్టరేట్​కు వస్తున్నందున... జిల్లా స్థాయి అధికారులు మండలాల్లో పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్కడి అధికారులతో సమన్వయమై.. ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రతిరోజు విధులకు హాజరవ్వాలని సూచించారు. ఈ-ఆఫీస్ పద్ధతి వల్ల పని వేగంగా జరుగుతున్నందున.. పెండింగ్ ఉంచకుండా ఫైళ్లను ఆమోదం కోసం పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ మహేశ్ బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details