తెలంగాణ

telangana

ETV Bharat / state

సాంకేతిక కారణాలతో కేటీపీపీలో నిలిచిన విద్యుత్​ ఉత్పత్తి - కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబు లీకేజీతో మొదటి యూనిట్‌లో‌ విద్యుత్ తయారి ఆగిందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తిని పునః ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

power-generation-stopped-in-kakatiya-thermal-project-for-technical-reasons
సాంకేతిక కారణాలతో కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

By

Published : Dec 27, 2020, 9:18 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోయింది. ప్రాజెక్టు మొదటి దశలో సాంకేతిక కారణాలతో 500 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయినట్లు కేటీపీపీ వర్గాలు తెలిపాయి.

కేటీపీపీలోని ఓ బాయిలర్ ట్యూబు లీకేజీతో మొదటి యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ఆగిందని అధికారులు వెల్లడించారు. మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'గగన్​యాన్​ ప్రయోగం కోసం హరిత ఇంధనం అభివృద్ధి'

ABOUT THE AUTHOR

...view details