మరణించిన పోలీసు కుటుంబాలకు.. జిల్లా పోలీసు సిబ్బంది చేయూత నివ్వడం అభినందనీయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్ ఎట్టి ఎర్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భార్య లక్ష్మికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్థిక చేయూత కింద రూ. 50వేల చెక్కును శ్రీనివాసులు అందజేశారు.
డ్యూటీలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. సిబ్బంది ఆర్థిక సాయం - police Staff financial assistance to head constable family
విధుల్లో ఉండగా అనారోగ్యంతో ఇటీవల ప్రాణాలు విడిచిన కానిస్టేబుల్ కుటుంబాన్ని తోటి సిబ్బంది ఆర్థికంగా ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబసభ్యులకు రూ. 50 వేల చెక్కును అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎర్రయ్య మృతితో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.
![డ్యూటీలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. సిబ్బంది ఆర్థిక సాయం financial help to head constable family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11060961-781-11060961-1616066722993.jpg)
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
దివంగత పోలీసు కుటుంబ సభ్యుల పరిస్థితిపైన ఆరా తీసిన అదనపు ఎస్పీ.. వారిని అధైర్య పడొద్దని ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమను సంప్రదించాలని సూచించారు. అర్హులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను త్వరగా వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను డీపీవో అయూబ్ ఆదేశించారు.
ఇదీ చదవండి:బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన మంత్రులు కొప్పుల, నిరంజన్‌రెడ్డి