Police explanation in case of Rakshita suicide: రక్షిత ఆత్మహత్యకు కారణం ర్యాగింగ్ కాదని ఇన్‌స్పెక్టర్ మల్లేశం క్లారిటీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయాలు తప్పు అని చెప్పారు. ఇన్‌స్పెక్టర్ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి పరిచయమున్న రాహుల్, జశ్వంత్ వేధింపుల కారణంగానే రక్షిత ఆత్మహత్య చేసుకుందని వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఇద్దిరిపై కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు కారణాలు ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొంత మంది సామాజిక మాధ్యమాల్లో ర్యాగింగ్ అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పుడు సమాచారమని స్పష్టం చేశారు.
కాలేజ్‌కి, నిందితులకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్లు ఆ కాలేజ్‌లో చదవట్లేదని తెలిపారు. పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి నిందితులని వెతుకుతున్నామని చెప్పారు. వారిపై గతంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయా? లేదా? అని ఆరాతీస్తున్నామని అన్నారు. భూపాలపల్లి పోలీసులను సంప్రదించామని.. ఏమైనా కేసులు ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో నిజనిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.