జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలో అధిక లోడుతో వస్తున్న 6 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. లారీలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. పరిమితికి మించి ఉన్నాయని స్టేషన్కు తరలించారు.
పరిమితికి మించి ఇసుక రవాణా.. లారీలు సీజ్ - Jayashankar Bhupalpally District News
భూపాలపల్లి పట్టణంలో బాంబుల గడ్డ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అధిక లోడు గల 6 ఇసుక లారీలను సీజ్ చేశారు. పరిమితికి మించిన లోడుతో పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.
పరిమితికి మించి రవాణ.. ఇసుక లారీలు సీజ్
డీఎస్పీ ఆదేశాలతో ఎస్సై ఉదయ్ కిరణ్ భూపాలపల్లి బాంబుల గడ్డ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా.. అధిక లోడుతో ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. వాటిని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి:'పరిమితికి మించి ఎక్కిస్తే కఠిన చర్యలు'
Last Updated : Mar 23, 2021, 10:39 PM IST