జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిపారు. ఆర్ముడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో స్మృతి పరేడ్‌ను నిర్వహించిన అదనపు ఎస్పీ శ్రీనివాసులు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులతో కలిసి ర్యాలీ చేపట్టారు. సమాజంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివని శ్రీనివాసులు పేర్కొన్నారు.
ప్రజా శ్రేయస్సుకు పోలీసుల సేవలు మరువలేనివి: శ్రీనివాసులు - భూపాలపల్లి అదనపు ఎస్పీ శ్రీనివాసులు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో స్మృతి పరేడ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ శ్రీనివాసులు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అమరుల కుటుంబసభ్యులతో ర్యాలీ చేపట్టారు.
పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన అదనపు ఎస్పీ శ్రీనివాసులు
ప్రజల ప్రాణాలు కాపాడటంలో పోలీసుల పాత్ర ముఖ్యమైనదని... ప్రజల పట్ల పోలీసులు స్పందిస్తున్న తీరు అభినందనీయమని ఏఎస్పీ అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో అమరులైన పోలీసులకు నివాళులర్పిస్తూ ఈ రోజు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు.
ఇవీచూడండి:వరదల నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు