పనుల్లో వేగం పెరగాలి.. - devadhula
ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ దేవాదుల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
వెంకటాపూర్ మండలంలోని నల్లగుంట సమీపంలోని.. ప్యాకేజీ 2లో భాగంగా నిర్మిస్తున్న దేవాదుల మూడో విడత పైపులైను, రామప్ప సరస్సు నుంచి గణపురం చెరువులోకి వెళ్లే గ్రావిటీ కెనాల్ పైపులైను ఔట్‌ఫాల్ పనులను కూడా పరిశీలించారు. కొన్ని చోట్ల పనులు సాగకపోవడంపై అధికారులను నిలదీశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇతర అధికారులు ఆమె వెంట ఉన్నారు. స్మితా సబర్వాల్... రామప్ప ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రామప్ప శిల్ప కళా సంపదను వీక్షించారు. ఆ తర్వాత ములుగు చేరుకుని అక్కడినుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.