రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి రెండో విడతలో భాగంగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. గ్రామంలో రోడ్లకిరువైపులా చెత్తను తొలగించారు. హరిత హరంలో నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్‌తో నీరు పోశారు. నాటిన ప్రతి మొక్కను బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సర్పంచ్ తెలిపారు.
రూపిరెడ్డిపల్లిలో రెండో విడత పల్లెప్రగతి - palle pragathi second session in regonda mandal
పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం మొదలు కానున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారులు, ప్రజలు గ్రామాభివృద్ధికి ముందుకొచ్చారు. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో పారిశుద్ధ్ధ్య పనులు చేపట్టారు.
![రూపిరెడ్డిపల్లిలో రెండో విడత పల్లెప్రగతి palle pragathi second session in regonda mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5561555-thumbnail-3x2-bhupa-rk.jpg)
రేగొండలో రెండోవిడత పల్లె ప్రగతి