జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు కాకతీయ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరరు చేరింది. దీంతో 4వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
కాకతీయ ఓపెన్కాస్ట్లోకి వాన నీరు.. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి! - జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి బొగ్గు గనుల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కాకతీయ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడం వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల దాదాపు రూ.3కోట్ల నష్టం జరిగినట్టు సింగరేణి అధికారులు తెలిపారు.
కాకతీయ ఓపెన్కాస్ట్లోకి వాన నీరు.. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి!
శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో డంపర్లు, లారీలు బురదలో కూరుకుపోయాయి. ఓపెన్ కాస్ట్ పరిసరాలు వర్షపు నీరు చేరడం వల్ల బురదమయంగా మారాయి. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల సింగరేణికి రూ.3 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు