తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా టీకాకు ఆన్‌లైన్‌ అవస్థలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు - ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు

కరోనా టీకాకు ఆన్‌లైన్‌ కష్టాలు తప్పడంలేదు. 18 నుంచి 45 ఏళ్లవారికి కొవిన్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకున్నవారికే వ్యాక్సిన్‌ ఇస్తామని నిర్ణయించడంతో... మారుమూల ప్రాంతాల్లో అవస్థలు తప్పడం లేదు. రేషన్‌ సరుకులు, ఆసరా పింఛన్లు, ఆన్‌లైన్‌ తరగతులకే సిగ్నల్స్‌ లేక జనం అవస్థలు పడుతుంటే... కరోనా టీకాకూ అదే సమస్య ఎదురవుతోంది.

corona vaccine problems in agency areas, corona vaccine latest problems
కరోనా టీకాకు ఆన్‌లైన్‌ అవస్థలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు

By

Published : May 5, 2021, 12:51 PM IST

కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ తప్పదని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా... అందరికీ టీకా అందించడంలో మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారికి టీకా అందించడం ప్రారంభించినా... ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారికే అందిస్తామనడంతో సమస్యలు తలెత్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ విధానం ఇబ్బందులు తెస్తోంది. టీకాల కొరత సమస్యా వేధిస్తోంది. మొదటి డోసు తీసుకున్నవారికీ స్లాట్‌ దొరక్క వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

వారి సాయంతో

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపుగా 28 లక్షల జనాభా ఉంటే... 18 ఏళ్లు పైబడిన వారు 18 లక్షల మంది ఉన్నారు. కానీ ఇప్పటికీ ఒకటి, రెండు డోసులు కలిపి కేవలం 3.5 లక్షల మందే టీకాలు తీసుకున్నట్లు తేలింది. గ్రామాల్లో ఆన్‌లైన్‌ సమస్య పరిష్కారానికి కార్యదర్శి, సర్పంచ్‌ల సాయంతో ముందుకెళ్తున్నామని జిల్లా వైద్య అధికారులు చెబుతున్నారు

తెలుసుకోకుండానే

రాష్ట్రంలో అనేక కేంద్రాల్లో వ్యాక్సిన్లతో పాటు కరోనా కిట్ల కొరతా కనిపిస్తోంది. కిట్లు లేక వ్యాధి అనుమానితులు ... తమకు వైరస్‌ సోకిందో లేదో తెలుసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.

ఇదీ చూడండి:నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

ABOUT THE AUTHOR

...view details