Pranahitha pushkaralu: ప్రాణహిత నదీ తీరం ఆధ్యాత్మిక చింతనతో పులకించిపోతోంది. ఐదో రోజు పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట, వేమనపల్లి.. కుమురం భీం జిల్లా తుమ్మిడిహెట్టి, మహారాష్ట్రలోని సిరోంచ పుష్కరఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పితృ దేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు.
కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే.. లక్ష మందికి పైగా ఆలయాన్ని సందర్శించారు. పూజలు, ప్రసాదాల ద్వారా రూ.6.92 లక్షల ఆదాయం సమకూరింది. కాళేశ్వరంలో నదీమాతకు రోజుకో హారతిలో భాగంగా ఆదివారం సప్త హారతినిచ్చారు. శ్రీహనుమదీక్షా పీఠం, మహాలక్ష్మి ట్రస్టు ఆధ్వర్యంలో పంచహారతి, మహాహారతి అందించారు. పుష్కర స్నానం ఎంతో పవిత్రమని.. సర్వపాపాలు హరిస్తుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.
కేసీఆర్పై అభిమానం..