అప్పుల బాధలు తట్టుకోలేక ఓ రైతన్న తన పొలం వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సుంకరి కుమారస్వామి అనే రైతు అప్పుల బాధతో తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైతు తన పొలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అప్పుల బాధలు భరించలేక రైతు మృతి - ATMAHATHYA
అప్పులు చేసి మరీ పండించిన పంటకు సరైన దిగుబడి రాక, గిట్టుబాటు ధరలు లేక ఓ రైతు నేలకొరిగాడు. తన వ్యవసాయ భూమిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధలు భరించలేక రైతు మృతి