జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. 500 మెగావాట్ల ఈ కేంద్రంలోని జనరేటర్ విభాగంలో ఆయిల్ లీక్ అయింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. హుటాహుటిన విద్యుదుత్పత్తి నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కేటీపీపీ ఉన్నతస్థాయి అధికారులు.. సిబ్బంది సాయంతో మరమ్మతు చర్యలు చేపట్టారు.
విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆయిల్ లీకేజీ.. తప్పిన ప్రమాదం - telangana news
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. జనరేటర్ విభాగంలో ఆయిల్ లీకేజీ అవ్వడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆయిల్ లీకేజీ