తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్పంచ్ సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జా' - ఆల్​ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘణపురం గ్రామంలో .. సర్పంచ్ సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటూ ఆల్​ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ మండిపడింది. స్థలాన్ని సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

Occupation of government land in collaboration with the Sarpanch in jayashankar district
'సర్పంచ్ సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జా'

By

Published : Dec 24, 2020, 12:25 PM IST

కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘణపురం చౌరస్తాలో.. ఆల్​ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ ధర్నా చేపట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను సద్దుమణిగించారు.

వార్డు సభ్యులతో మీటింగ్ పెట్టి తీర్మానం చేయకుండా.. సర్పంచ్ ఓ వ్యక్తితో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చాడని పార్టీ నేతలు ఆరోపించారు. అధికారులు తక్షణమే భూమిని సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:'కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలి'

ABOUT THE AUTHOR

...view details