భూపాలపల్లి జిల్లాలో సహకార సంఘం ఎన్నికల్లో 130 వార్డులకు 646 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రేగొండ మండలంలోని 10 వార్డులో ఒక్కరే నామినేషన్ వేయడం వల్ల ఆ వార్డులో నడిపెల్లి పావని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జంగేడు, చిట్యాల, కటారం, మహముత్తారం, మహాదేవ్‌పూర్, మొగుల్లపల్లి, మల్హర్, ఘణపూర్, చెల్పూర్ మండలాల నుంచి పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ముగిసిన నామినేషన్లు, 15న ఎన్నికలు - జయశంకర్ భూపాలపల్లి జిల్లా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీయస్)10 సంఘాలలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 130 వార్డులకు 646 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ముగిసిన నామినేషన్లు, 15న ఎన్నికలు
గత ఎన్నికల్లో ఓటమి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, రాజకీయ నాయకులు సైతం ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. నువ్వా.. నేనా అన్నట్లు పోటీకి ప్రయత్నిస్తున్నారు. ఈ నామినేషన్లు 9న పరిశీలన, 10న ఉపసంహరణ, 15 న ఎన్నికలు, మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం