ప్రజలందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. భూపాలపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భూపాలపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం - new primary health center started at bhoopalapally district
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వచ్చింది. నూతన ఆస్పత్రి భవనాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు.
![భూపాలపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5056187-thumbnail-3x2-jaya-rk.jpg)
భూపాలపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
భూపాలపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం