ETV Bharat / state
కార్యాలయాల కేటాయింపు - కలెక్టరేట్
ములుగు జిల్లాను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్‌కు, పశుసంవర్ధక శాఖ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు.
ములుగు జిల్లా
By
Published : Feb 17, 2019, 9:45 AM IST
| Updated : Feb 17, 2019, 10:07 AM IST
ములుగు జిల్లాకు కార్యాలయాల కేటాయింపు ములుగు మండలాన్ని జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అధికారులు కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టరేట్‌గా, పశుసంవర్ధక శాఖ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న ములుగు తహశీల్దార్ కార్యాలయంలోని కొంత భాగాన్ని ఆర్డీవోకు కేటాయించారు. డివిజన్ అటవీ కార్యాలయాన్ని జిల్లా అటవీశాఖ కార్యాలయంగా మార్పులు చేశారు. ప్రభుత్వ భవనాలకు ఉన్న భూపాలపల్లి పేరును తొలగించి, ములుగు పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. Last Updated : Feb 17, 2019, 10:07 AM IST