జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శనివారం దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శుభానందదేవి, పార్వతీ దేవి అమ్మవారి ఆలయాల్లో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు.
కాళేశ్వరంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశేశ్వరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అర్చకులు ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు అమ్మవార్లకు పూర్ణాభిషేకం, అఖండ దీపారాధన, చండీ హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కాళేశ్వరంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
మొదటి రోజు అమ్మవార్లకు పూర్ణాభిషేకం, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, దీక్షావస్త్రధారణ, రక్షా బంధనం, చండీహోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో దర్శనం చేసుకోగా.. అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండిఃజీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల కూల్చివేత