తెలంగాణ

telangana

ETV Bharat / state

'అటవీ చట్టాల అమలు, టోల్​ఫ్రీ నంబర్​పై విస్తృత ప్రచారం' - bhupalapally district forest department news

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అటవీశాఖ ప్రకృతి భవన్​లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు అంశాలపై అధికారులు చర్చించారు. వేట నివారణకు అటవీ చట్టాల అమలు, అటవీ టోల్ ఫ్రీ నంబర్​ 1800 4255 364 గురించి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు.

'అటవీ చట్టాల అమలు, టోల్​ఫ్రీ నెంబర్​పై విస్తృత ప్రచారం'
'అటవీ చట్టాల అమలు, టోల్​ఫ్రీ నెంబర్​పై విస్తృత ప్రచారం'

By

Published : Oct 3, 2020, 8:02 PM IST

జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అటవీశాఖ ప్రకృతి భవన్​లో క్షేత్ర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ఓరుగల్లు వైల్డ్​లైఫ్​ సొసైటీ, భూపాలపల్లి ఈకో క్లబ్​లతో.. జీవవైవిధ్యం, మానవులు-అటవీ జంతువుల మధ్య వైరం, ఈకో టూరిజం అంశాలపై కార్యశాల నిర్వహించారు.

భూపాలపల్లిలోని పాండవుల గుట్ట, బొగ్గులవాగు అటవీ పార్క్, ముక్తివనం, రాంక్ష్మన్ వారసత్వ టేకు వృక్షాలు, కొయ్యుర్ జైన గుహలు మొదలైన పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై చర్చించారు. వేట నివారణకు అటవీ చట్టాల అమలు, అటవీ టోల్ ఫ్రీ నంబర్​ 1800 4255 364 గురించి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు.

ఇవీ చూడండి:కొత్తగా ఐదు గనుల నిర్మాణ ప్రణాళికకు సింగరేణి బోర్డు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details