పర్యావరణ అనుమతులు సరిగా లేవంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబర్ 13కి వాయిదా పడింది. ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేసిన తర్వాత తీసుకున్న పర్యావరణ అనుమతులను సవరించలేదని పిటిషనర్ హయాతూద్దీన్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంచిన తర్వాత అంతకుముందు తీసుకున్న పర్యావరణ అనుమతుల సవరణ కోరలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. మధ్యంతర పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరినందున... ఎన్జీటీ రెండు వారాల గడువు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ నవంబర్ 13న జరగనుంది.
కాళేశ్వరంపై కౌంటర్‌కు సర్కారుకు రెండువారాల గడువు.. - కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది.
kaleshwaram project