పీకలదాకా మద్యం సేవించి టాటా ఏసీ ట్రాలీలో వెళ్తూ బీరు సీసాను రోడ్డుపై విసిరేసిన ఆకతాయిలకు తనదైన శైలిలో ఓ సర్పంచ్ గుణపాఠం నేర్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటలో మేడారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ వాహనంలో నుంచి బీరు సీసాను రోడ్డుపై విసరడం కొర్లకుంట సర్పంచ్ ముక్కెర నవీన్ కుమార్‌కు కనిపించింది.
ఆకతాయిలకు బుద్ధి చెప్పిన సర్పంచ్ - ముక్కెర సర్పంచ్ నవీన్ కుమార్ వార్తలు భూపాలపల్లి జిల్లా
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆకతాయిలకు ఓ సర్పంచ్ గుణపాఠం నేర్పారు. పూటుగా తాగి తాము వెళ్తున్న వాహనంలో నుంచి బీరు బాటిల్‌ను రోడ్డుపైకి విసిరేశారు ఆకతాయిలు. అది చూసిన సర్పంచ్.. వారి వాహనాన్ని వెంబడించారు. వారితో మాట్లాడి.. బీరు సీసా విసిరిన ప్రాంతానికి తీసుకెళ్లి.. చీపురుతో ఊడ్పించారు.
![ఆకతాయిలకు బుద్ధి చెప్పిన సర్పంచ్ ఆకతాయిలకు బుద్ధి చెప్పిన సర్పంచ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9591915-653-9591915-1605778808646.jpg)
ఆకతాయిలకు బుద్ధి చెప్పిన సర్పంచ్
దీంతో ఆయన తన వాహనంతో ఆకతాయిలు వెళ్తున్న వాహనాన్ని వెంబండిచారు. బీరు సీసా విసిరిన ప్రాంతానికి వారిని తీసుకువచ్చి చీపురుతో ఊడ్పించారు. సీసా ముక్కలు ఎత్తించి రహదారికి దూరంగా వేయించారు. మరోసారి ఇలా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేయవద్దని సూచించారు.
ఇదీ చదవండి:'వరదసాయం కింద కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు'