తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2020, 9:04 PM IST

ETV Bharat / state

'రాజగృహం దాడిపై సీబీఐ విచారణ జరిపించాలి'

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని ప్రధాన రహదారిపై ఎమ్మార్పీఎస్​, ఏబీఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ముంబయిలోని రాజాగృహం మీద జరిగిన దాడికి నిరసనగా ధర్నా చేశారు. మహారాష్ట్రలో ఉన్న శివసేన ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం... సీబీఐతో విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

mrps leaders protest against attack on ambedkar house
mrps leaders protest against attack on ambedkar house

ముంబయిలోని రాజాగృహం మీద జరిగిన దాడికి నిరసనగా... జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని ప్రధాన రహదారిపై ఎమ్మార్పీఎస్​, ఏబీఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. అణగారిన పేద ప్రజల విముక్తి కోసం పాటుపడిన వ్యక్తి డా.అంబేడ్కర్​ గృహంపై దాడి చేయడం సిగ్గు మాలిన చర్య అని నాయకులు మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ... కేంద్రం హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

మహారాష్ట్రలో ఉన్న శివసేన ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం... సీబీఐతో విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్, ఏబీఎస్​ఎఫ్​ కేయూ అధ్యక్షులు సదిరం రాజుకుమార్, బోయ శ్రీను, పూర్ణ, కొండమల్ల విష్ణు, కొండమల్లు శివ తదితరులు పాల్గొన్నారు..

ఇవీ చూడండి:మీ ఇంటికే కరోనా కిట్.. హోం ఐసొలేషన్ బాధితులకు మాత్రమే..!

ABOUT THE AUTHOR

...view details