భిక్షాటనపై తహసీల్దార్ స్పందన ములుగు జిల్లా వెంకటాపూర్‌లో రైతుల భిక్షాటన ఘటనపై తహసీల్దార్ స్పందించారు. రైతుకు సంబంధించిన భూమి ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉందని.. ధరణి వెబ్సైట్లో వివరాలు లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తహసీల్దార్ దేవానాయక్ అన్నారు. భిక్షాటన చేస్తోన్న రైతులను తన సొంత వాహనంలో తీసుకెళ్లి భూములను పరిశీలించారు. అధికారులతో విచారణ జరిపి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానని అన్నదాతలకు హామీ ఇచ్చారు.
ఇదీ కారణం
తన భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి వీఆర్వో లంచం అడిగాడని ఆరోపిస్తూ వెంకటాపూర్‌కు చెందిన రైతు దేవేందర్ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపాడు.
ఇవీ చదవండి:పట్టా కోసం భిక్షాటన