జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కో-ఆప్షన్ మెంబర్ నామపత్రాల స్వీకరణ ఉండగా... ఎవరూ సమర్పించలేదు. సభ్యుల కోరం కూడా లేనందున ఎంపీపీ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రీసైడింగ్ అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. తదుపరి చర్యలకు జిల్లా పాలనాధికారికి నివేదించినట్లు, కలెక్టర్ సూచన మేరకు ఎన్నిక చేపడతామని స్పష్టం చేశారు.
మహాదేవ్‌పూర్ ఎంపీపీ ఎన్నిక వాయిదా - jayashankar bhupalapally
మండల పరిషత్ సభ్యుల కోరం లేని కారణంగా... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. పాలనాధికారి సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ప్రీసైడింగ్ అధికారి తెలిపారు.

మహాదేవ్‌పూర్ ఎంపీపీ ఎన్నిక వాయిదా